తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ నెల 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజాపా ఎస్టీ విభాగం జాతీయ నాయకుడు శ్రీరామ్‌నాయక్ డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
'తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి' - telangana vimochana dinostavam
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల తహసీల్దార్‌కు భాజపా నాయకులు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ విమోచనాదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
!['తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి' bjp leaders gave petition to utnur mro](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8732524-709-8732524-1599616805600.jpg)
bjp leaders gave petition to utnur mro
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత విమోచన దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్... ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ నెల 17న జిల్లా వ్యాప్తంగా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.