తెలంగాణ

telangana

ETV Bharat / state

జడ్పీ ఛైర్మన్​ తీరుపై భాజపా ఆగ్రహం - ఆదిలాబాద్​ జిల్లా లేటెస్ట్​ వార్తలు

ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్ధన్ వ్యవహార తీరుపై భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర నిధులతో నిర్మిస్తున్న రైతు వేదికలపై తెరాస నేతల ఫొటోలు పెడుతున్నారని విమర్శించారు.

bjp leaders fire on adilabad zp chairman janardhan
జడ్పీ ఛైర్మన్​ తీరుపై భాజపా ఆగ్రహం

By

Published : Dec 12, 2020, 10:29 AM IST

సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్ధన్ తప్పించుకుంటున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. జడ్పీ నిధుల మళ్లింపు విషయంలో సమాధానం చెప్పకుండా... సభ్యులను సస్పెండ్ చేశారని చెప్పారు.

కేంద్ర నిధులతో నిర్మిస్తున్న రైతు వేదికలపైన తెరాస నేతల ఫొటోలు పెడుతున్నారని విమర్శించారు. ఆ ఫొటోలను తీయించి జడ్పీ ఛైర్మన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:పేకాట కోసం 50 ఎకరాలు అమ్మాడు.. చివరికి దొంగగా మారాడు!

ABOUT THE AUTHOR

...view details