నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఆదిలాబాద్లో భాజపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నేతాజీ విగ్రహానికి ఎంపీ సోయం బాపురావు పూలమాల వేసి నివాళులర్పించారు.
'మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే నేతాజీకి సరైన గుర్తింపు' - Adilabad District Latest News
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే నేతాజీకి అసలైన గుర్తింపు లభించిందని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. ఆదిలాబాద్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిలో ఆయన మాట్లాడారు.

ఆదిలాబాద్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుక
ఆయన సేవలు గుర్తు చేస్తూ.. మోదీ ప్రధాని అయ్యాకే నేతాజీ పరాక్రమానికి తగిన గుర్తింపు లభించిందని ఎంపీ పేర్కొన్నారు. వేడుకల్లో భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, పట్టణ అధ్యక్షుడు ఆకుల ప్రవీణ్, నాయకులు రమేష్, రవి, మున్నా పాల్గొన్నారు.
ఇదీ చూడండి:నేతాజీని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి: బండి