భాజపా తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా నేతలు తరలిపోకుండా పోలీసులు నిలువరించారు. ఉదయం నుంచి భాజపా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, నాయకులను గృహనిర్బంధం చేశారు.
ఆదిలాబాద్లో భాజపా నేతల అరెస్టు - etv bharath
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భాజపా తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా నేతలు తరలిపోకుండా పోలీసులు నిలువరించారు. ఉదయం నుంచి భాజపా నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
ఆదిలాబాద్లో భాజపా నేతల అరెస్టు
పోలీసుల తీరును నిరసిస్తూ భాజపా నేతలు నిరసన తెలిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోలీసు చర్యతో హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమయిందని చెప్పారు.