ఒకేసారి రుణమాఫీ చేసి, రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదిలాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలిసి కలెక్టర్ శ్రీదేవసేనకి వినతిపత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ లక్ష రుణం మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు.
కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన భాజపా జిల్లా అధ్యక్షుడు - adilabad district collector
వెంటనే రైతులకు రుణమాఫీ చేసి, రైతుబంధు నిధులు రైతులు ఖాతాల్లో జమ చేయాలని ఆదిలాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన భాజపా జిల్లా అధ్యక్షుడు
రైతుబంధు విషయంలోనూ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు ఆదినాథ్, వేణుగోపాల్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:పింఛన్ల కోతపై హైకోర్టులో విచారణ