లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది వలస కూలీలు నడుస్తూనే సొంతూళ్లకు బయల్దేరారు. ఉపాధి కోసం వచ్చిన వందలాది వలస కుటుంబాలు పని లేక.. తిండికి తిప్పలు పడలేక సొంతూళ్ల బాట పట్టారు. వందలాది వలస కూలీలు హైదరాబాద్ నుంచి రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు ఆదిలాబాద్ గుండా నడిచి వెళ్తున్నారని తెలిసి భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ జిల్లా సరిహద్దులోని పిప్పర్వాడ వద్ద వారిని కలుసుకున్నారు. వారికి భోజన ఏర్పాట్లు చేశారు. వలస కార్మికుల కోసం ప్రభుత్వం వాహనాలు ఏర్పాటు చేసిందని, అందరూ.. ఆ వాహనాలు ఉపయోగించుకోవాలని సూచించారు.
వలస కూలీలకు అన్నం పెట్టిన భాజపా నేత - వలస కూలీలకు భోజనం ఏర్పాటు
కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్ వల్ల చాలామంది వలస కూలీలు కాలినడకన సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. ప్రభుత్వాలు వలస కూలీలను తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేసినా.. ఇంకా చాలామంది కాలినడకనే.. స్వస్థలాలకు పయనమయ్యారు.
వలస కూలీలకు అన్నం పెట్టిన భాజపా నేత