కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లును తెరాస వ్యతిరేకించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. గత ఆరేళ్లలో కేంద్రం ప్రతిపాదించిన బిల్లును తెరాస వ్యతిరేకించడం, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ చేయడంపై భాజపా నేతలు విమర్శిస్తున్నారు. తెరాస ఎమ్మెల్యేలు హిందూ జాతికి వ్యతిరేకమని ఆదిలాబాద్ భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో తెరాస, ఎంఐఎంల తీరును దుయ్యబట్టారు.
'హిందువులకు తెరాస క్షమాపణ చెప్పాలి' - BJP FIRE ON TRS BECAUSE OF CITIZEN AMENDMENT ACT
కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లును తెరాస వ్యతిరేకించటం వల్ల ఆదిలాబాద్ జిల్లాలో భాజపా నేతలు తెరాస నాయకులపై విమర్శల వర్షం గుప్పించారు.
'హిందువులకు తెరాస క్షమపణ చెప్పాలి'