ఆదిలాబాద్ నియోజకవర్గంలో తెరాస, భాజపా మాటల యుద్దం రాజుకుంటోంది. నిన్న తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న భాజపా నాయకులపై విరుచుకుపడగా.. ఈరోజు భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఎమ్మెల్యే వాఖ్యలను తిప్పికొట్టారు.
'భాజపాకు ఆదరణను చూసి ఓర్వలేకే తెరాస ఆరోపణలు' - BJP district president Payal Shankar latest news
భాజపాకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తెరాస నాయకులు ఒత్తిడిలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ విమర్శించారు. జోగురామన్న మాటలు మతి స్థిమితం కోల్పోయిన వాడిలా ఉన్నాయని ఆరోపించారు.
'ఆదరణ చూసి ఓర్వలేకే అలా మాట్లాడుతున్నారు'
ఆదిలాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెరాస తీరును దుయ్యబట్టారు. భాజపాకు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణచూసి ఓర్వలేక తెరాస నాయకులు నోటికొచ్చినట్లు ఆరోపిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే జోగురామన్న ఒత్తిడిలో మతిస్థిమితం కోల్పోయిన వాడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు.