కేంద్ర ప్రభుత్వ సాయంతో చేపట్టిన రైతు వేదికలపై ప్రధాని చిత్రాన్ని ముద్రించలేదని నిరసిస్తూ.. భాజపా శ్రేణులు ఆదిలాబాద్ జిల్లా సొనాలలో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను అడ్డుకోవడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల నిర్మించిన రైతు వేదిక ప్రారంభోత్సవానికి హాజరైన పాలనాధికారి సిక్తాపట్నాయక్ వాహనాన్ని సొనాల బస్టాండ్ వద్ద భాజపా కార్యకర్తలు అడ్డగించి రోడ్డుపై బైఠాయించారు.
'రైతు వేదికలపై ప్రధాని చిత్రాన్ని ముద్రించాల్సిందే' - ఆదిలాబాద్ జిల్లా తాజా వార్తలు
కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను ఆదిలాబాద్ జిల్లా సొనాలలో భాజపా శ్రేణులు అడ్డుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ సాయంతో చేపట్టిన రైతు వేదికలపై ప్రధాని చిత్రాన్ని ఎందుకు ముద్రించలేదని రోడ్డుపై బైఠాయించి.. కార్యకర్తలు నిరసన తెలిపారు.
'రైతు వేదికలపై ప్రధాని చిత్రాన్ని ముద్రించాల్సిందే'
చివరికి పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇదే కార్యక్రమానికి రావాల్సిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. ఆందోళన దృష్ట్యా వేరే మార్గంలో వచ్చి రైతు వేదికను ప్రారంభించారు.
ఇదీ చూడండి: కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది కౌన్సెలింగ్