ఆదిలాబాద్‌లో భాజపా కార్యకర్తల అరెస్టు - BJP protest in Adilabad latest news
ఆదిలాబాద్‌లో భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. పలువురి భాజపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
![ఆదిలాబాద్‌లో భాజపా కార్యకర్తల అరెస్టు BJP activists arrested in Adilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9452312-835-9452312-1604654236738.jpg)
ఆదిలాబాద్‌లో భాజపా కార్యకర్తల అరెస్టు
భాజపా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదిలాబాద్‌లో ఆపార్టీ శ్రేణులు చేపట్టిన ఆందోళన అరెస్టులకు దారితీసింది. వినాయక్‌చౌక్‌కు వచ్చిన పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో... తోపులాట చోటుచేసుకుంది. కొంత మంది కార్యకర్తలు పోలీసుల నుంచి తప్పించుకుని వెళ్లారు. దాంతో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సహా పలువురి నేతలను అరెస్టు చేయడంతో ఆందోళన సద్దుమణిగింది.