ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన అన్నదమ్ములు షేక్ అన్వర్, షేక్ ఫెరోజ్‌కు బాల్యం నుంచే పక్షులంటే అమితమైన ఆసక్తి. అదే ఆసక్తి వారిని పక్షి ప్రేమికులుగా మార్చింది. ఇచ్చోడలోనే ప్రత్యేకంగా ఓ గదిని అద్దెకు తీసుకొనేలా చేసింది. ప్రస్తుతం వారు పక్షులకు శిక్షణనిస్తున్నారు. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి విభిన్నజాతులకు చెందిన పక్షి పిల్లలను కొనుగోలు చేసి ఇచ్చోడకు తీసుకొస్తారు. వాటికి సోను, మున్నా, చింటూ అని పిల్లల మాదిరిగా పలకరిస్తూ... 21 రోజులపాటు కొనసాగే శిక్షణ అంతా పక్షుల పాఠశాలను తలపిస్తుంది. ఇక్కడ శిక్షణ ఇచ్చిన లవ్‌బర్డ్స్‌కు అమితమైన డిమాండ్ ఉంది. మూడు రంగుల్లో ఉండే ఆస్ట్రేలియన్ చిలకలు, నెత్తిన జుట్టు ఉండే కాక్‌టెయిల్ పక్షులు, పావురాలు సహా భిన్న జాతులు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
పక్షులే కాదు..