నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ డిపో ఎదుట అధికార పార్టీ తెరాసతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఉదయం నుంచే డిపో ముందు నేతలు బైఠాయించారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో కార్మికులు బయటే ఉండిపోయారు.
ఆదిలాబాద్‌లో భారత్ బంద్... డిపోలకే పరిమితమైన బస్సులు - భారత్ బంద్‌లో వామపక్షాలు
వ్యవసాయ చట్టాలపై నిరసన తెలుపుతూ నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లో తెరాసతో సహా పలు పార్టీలు ఆందోళనలో పాల్గొన్నాయి. ఆర్టీసీ డిపో ముందు పలువురు నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్‌లో భారత్ బంద్... డిపోలకే పరిమితమైన బస్సులు
ఈ ఆందోళనలో ఆదిలాబాద్ పుర అధ్యక్షులు జోగు ప్రేమనగర్, కాంగ్రెస్ ఇంఛార్జ్ సాజిద్ ఖాన్, సీపీఐ, సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రైతన్న పోరు: సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్