ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రెండురోజుల పాటు జరగనున్న భాజపా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు వేణుగోపాల్‌రెడ్డి ప్రారంభించారు. స్థానిక ప్రైవేటు ఫంక్షన్‌హాల్లో ప్రారంభమైన తరగతులలో కేంద్రంలో భాజపా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఇటీవల తీసుకొచ్చిన మూడు కిసాన్ చట్టాలపై తర్ఫీదు ఇచ్చారు. ప్రతి ఒక్క భాజపా కార్యకర్త ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించుకోవాలని వివరించారు.
భాజపా శిక్షణ తరగతుల ప్రారంభం - Telangana news
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రెండురోజుల పాటు భాజపా నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై తర్ఫీదు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు.

భాజపా శిక్షణ తరగతుల ప్రారంభం