భైంసా ఘర్షణల్లో సంబంధంలేని వ్యక్తులను పోలీసులు నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని కేంద్ర బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఆరోపించారు. సమగ్ర నివేదికను రాష్ట్రపతితోపాటు కేంద్ర హోంశాఖమంత్రికి సమర్పించనున్నట్లు వెల్లడించారు.
భైంసా ఘర్షణల్లో సంబంధంలేని వ్యక్తులు అరెస్ట్: ఆచారి - Telangana news
ఆదిలాబాద్ జిల్లా జైలును కేంద్ర బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి సందర్శించారు. భైంసా ఘర్షణల్లో నిందితులుగా అరెస్టయి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నవారిని ఆయన పరామర్శించారు.
భైంసా ఘర్షణల్లో సంబంధంలేని వ్యక్తులు అరెస్ట్: ఆచారి
ఇవాళ ఆదిలాబాద్ జిల్లా జైలును ఆచారి సందర్శించారు. ఇటీవల వివాదస్పదమైన భైంసా ఘర్షణల్లో నిందితులుగా అరెస్టయి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నవారిని ఆయన పరామర్శించారు. ఘటనకు దారితీసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆదిలాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్ శంకర్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి ఉన్నారు.
ఇదీ చదవండి:గిరిజన గ్రామపంచాయతీల అభివృద్ధికి కృషి: మంత్రి సత్యవతి