ఒకప్పుడు బతుకమ్మ పండుగ అంటే.. పురాణ గాథలతో బతుకమ్మ ఆటలతో ఊర్లన్నీ కళకళలాడేవి. కానీ ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటే... డీజే చప్పుళ్లు, కోలాటాలు, నృత్యాలు. ఏది ఏమైనప్పటికీ... అప్పటి పాటలు ఆ పండుగలే వేరు. ఆ పండగను, పాటలను గుర్తుకు చేస్తూ అలాగే పండుగ సంబురాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెంది చాలా మంది. జిల్లాలోని చాలా గ్రామాల్లో వృద్ధులు బతుకమ్మ పాటలను గుక్క తిప్పకోకుండా పాడేస్తున్నారు. అలాగే ఈ తరం వారికి ఆనాటి పాటలను నేర్పిస్తూ.. బతుకమ్మ ఆటకున్న విశిష్టతను చెబుతున్నారు.
బతుకమ్మను బతికిస్తున్న మహిళలు - పురాణ, ఇతిహాసాలకు సంబంధించిన పాటలు
బతుకమ్మ అంటే డీజే చప్పుళ్లు, కోలాటాలు, నృత్యాలు కాదు. పురాణ, ఇతిహాసాలకు సంబంధించిన పాటలకు చప్పట్లు కొడుతూ ఆడే బతుకమ్మ ఆటలని చెబుతున్నారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చాలా మంది పెద్ద మహిళలు.
బతుకమ్మను బతికిస్తున్న మహిళలు