దేశ వ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా ఆదిలాబాద్లో ఎస్బీఐ వద్ద బ్యాంకు ఉద్యోగుల ఆందోళన చేశారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని.. వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకులో సరిపడా ఉద్యోగులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వారానికి ఐదు రోజుల పనిదినాలు మాత్రమే ఉండాలన్నారు. విధులు నిర్వహించే సమయంలో సమయపాలన లేకుండా శ్రమదోపిడి చేస్తున్నారని ఆరోపించారు.
సమస్యల పరిష్కారానికి బ్యాంకు ఉద్యోగుల ధర్నా - సమస్యల పరిష్కారానికి బ్యాంకు ఉద్యోగుల ధర్నా
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదిలాబాద్లో బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. విధులు బహిష్కరించి ఎస్బీఐ బ్యాంక్ వద్ద నిరసన చేపట్టారు.
సమస్యల పరిష్కారానికి బ్యాంకు ఉద్యోగుల ధర్నా
TAGGED:
bankers strike