తమది లౌకికవాదమని చెప్పుకునే తెరాస, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఒక వర్గంపై దాడి చేసినపుడు మాత్రమే స్పందిస్తాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులను ఎందుకు ఖండించరని ప్రశ్నించారు. ఆదిలాబాద్ పట్టణంలో పర్యటించిన సంజయ్.... బైంసా బాధితులను పరామర్శించారు.
'బైంసా బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తా' - banmdi sanjay visitation
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదిలాబాద్లో పర్యటించారు. బైంసా బాధితులను సంజయ్ పరామర్శించారు. హిందువులపై జరుగుతున్న దాడులను మిగతా పార్టీలు ఎందుకు ఖండించట్లేదని ప్రశ్నించారు. బైంసా బాధితుల తరఫున న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
'బైంసా బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తా'
పోలీసుల చర్యలను బండి సంజయ్ దుయ్యబట్టారు. ఘటన వివరాలు తెలుసుకుని బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. అవసరమైతే బాధితులకు న్యాయం జరిగేందుకు హైకోర్టును ఆశ్రయిస్తామని, తగు చర్యల కోసం కేంద్రానికి సమాచారం ఇస్తామన్నారు. బైంసా ఘటనలో కేవలం హిందువులను లక్ష్యం చేసుకుని చితకొట్టిన స్థానిక సీఐ, జిల్లా ఎస్పీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.