ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు... పుర ఎన్నికల్లో ఓటును సద్వినియోగం చేసుకోవాలనే నినాదంతో ఆదిలాబాద్‌లో ఈటీవీ-ఈనాడు చేపట్టిన అవగహన ర్యాలీకి విశేష స్పందన లభించింది. జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌రెడ్డితో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు, యువత పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఎన్టీఆర్ చౌక్‌లోమానవహారంగా ఏర్పడిన ఓటుహక్కును సద్వినియోగం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల్లో ఏకగ్రీవాలు మంచి పరిణామం కావని చాటిచెప్పిన యువత... నచ్చని అభ్యర్థులు నిలబడితే... నోటాకు ఓటువేయాలని సూచించారు.