ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.... కోటి మొక్కలు నాటిన కొన్ని రోజులకే..... ఆదిలాబాద్ జిల్లాలో చెట్లు నరికివేశారు. ఇచ్చోడలోని గిరిజన ప్రాథమిక సహకార సంస్థ కార్యాలయ ఆవరణలోని నాలుగు భారీ వృక్షాలను అధికారులు తొలగించారు. 2003 కంటే ముందు నుంచి ఉన్న వృక్షాలను నరికివేయటంతో.... మొన్నటిదాకా పచ్చదనంతో కనిపించిన కార్యాలయం బోసిపోయినట్లు కనిపిస్తోంది.
ఓవైపు హరితహారం.. మరోవైపు చెట్లు నరకటం.. - ఆదిలాబాద్ జిల్లా లేటెస్ట్ వార్తలు
ఓ వైపు హరితహారానికి ప్రాధాన్యతనిస్తూ.... ప్రభుత్వం విరివిగా మొక్కలు నాటుతుంది. పచ్చదనం పెంపుకోసం కృషి చేస్తోంది. ఇందుకు భిన్నంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఓ అటవీ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రంలో నాలుగు భారీ వృక్షాలను నరికివేశారు. ఏళ్ల నుంచి ఎంతో మందికి నీడనిచ్చిన చెట్లను.. అధికారులు తొలగించటంపై విమర్శలు వస్తున్నాయి.
ఓవైపు పెచ్చుతుంటే మరోవైపు తుచ్చుతున్నారు
గిరిజనులకు అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయటంతో పాటు అటవీ ప్రాధాన్యతను తెలియజేయటంలో.. గిరిజన సహకార సంస్థలు ప్రధాన బాధ్యత వహించాలి. కానీ, ఇవి పరిగణలోకి తీసుకోకుండా వృక్షాలను నరికివేయటం పట్ల స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అటవీ శాఖ అధికారులే చెట్లు నరికివేయటం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి:కేటీఆర్ పీఏనంటూ డబ్బులు డిమాండ్