హైదరాబాద్‌లో ఈనెల 27న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే అంబేడ్కర్ వాదుల మహాగర్జనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడాల స్వామి విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో మహాగర్జన ప్రతులను ఆవిష్కరించారు. అంబేడ్కర్‌కు భారతజాతి మొత్తం నివాళులర్పించినా.. కేసీఆర్ మాత్రం ఆయన జయంతి ఉత్సవాలకు హాజరుకాకపోవడం బాధాకరమన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆందోళనలకు కారణమైన విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అంబేడ్కర్‌వాదుల మహాగర్జనను విజయవంతం చేయండి - hyderabad panjagutta ambedker statue
ఈనెల 27న హైదరాబాద్‌లో నిర్వహించనున్న అంబేడ్కర్‌వాదుల మహాగర్జనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడాల స్వామి కోరారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలంతా సభకు హాజరుకావాలని కోరారు.
మహాగర్జనను విజయవంతం చేయండి