ఆదిలాబాద్‌లోని మూగ, చెవిటి, మానసిక వికలాంగులకు, అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు విద్యాశాఖ కృత్రిమ పరికరాలను పంపిణీ చేసింది. స్థానిక భవిత పాఠశాలలో చదువుకుంటున్న 25 మంది విద్యార్థులకు వీల్‌చైర్లు, రొలేటర్లు, కాలీపర్లు, ఎమ్మార్ కిట్లు అందజేశారు.
మానసిక వికలాంగులకు కృత్రిమ పరికరాల పంపిణీ - అంగవైకల్యం
ఆదిలాబాద్ జిల్లాలోని స్థానిక భవిత పాఠశాలలోని మానసిక వికలాంగులకు, అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు డీఈవో రవీందర్‌రెడ్డి కృత్రిమ పరికరాలను పంపిణీ చేశారు. ఏటా విద్యాశాఖ సాయంతో కొంత మంది విద్యార్థులకు ఈ పరికాలను పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.
మానసిక వికలాంగులకు కృత్రిమ పరికరాల పంపిణీ
ఏటా అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృత్రిమ పరికరాలు పంచుతున్నామని డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి:కరోనాపై ప్రముఖుల ప్రచారం