తెలంగాణ

telangana

ETV Bharat / state

గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల పంపిణీ

దివ్యాంగుల కష్టాలను చూసి గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ వారికి తోడుగా నిలుస్తోంది. మనలాగే వారు సమానమేనని చాటి చెబుతోంది. వారి కోసం ఆదిలాబాద్‌ జిల్లాలో ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి చినజీయరు స్వామి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

Artificial body parts distribution to handicaps in adialabad district
గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల పంపిణీ

By

Published : Nov 5, 2020, 4:51 PM IST

ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీల్‌ఛైర్లు, మూడు చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలను వారికి అందించారు. జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగులు తరలి వచ్చారు.

ఈ కార్యక్రమానికి చిన జీయరు స్వామిజీ ముఖ్యఅతిథిగా హాజరై దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందజేశారు. నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కరోనాను జయించే శక్తిని మనందరం పొందాలని స్వామిజీ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న, రామచంద్రగోపాలకృష్ణ, మఠాధిపతి యోగానంద సరస్వతి, అహోబిల జీయరుస్వామి, ట్రస్ట్ ప్రతినిధి జగదీష్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'రాష్ట్రాన్ని దేశంలోనే తలమానికంగా నిలిపేలా కృషి చేస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details