ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన అంగన్వాడీ సిబ్బంది కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా - latest news on Angan wadi dharna before the collectorate
అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేసే ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా
ధర్నాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు చిన్నన్న, అంగన్వాడీ సంఘ అధ్యక్షురాలు వెంకటమ్మ, కార్యదర్శి సునీత తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. తిరంగ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు