తెలంగాణ

telangana

తరాలు మారినా ఆ ఊరి ప్రజలు ఆ ఆచారాన్ని వదలలేదు..!

By

Published : Oct 3, 2021, 8:34 PM IST

ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూరు మండలం బీర్​సాయిపేట పంచాయతీలోని ధర్మాజీపేట గ్రామంలో సుమారు 30 ఇళ్లు ఉంటాయి. 120 మంది జనాభా ఉంటారు. ఆగ్రామంలో ఏ ఇంట్లో చూసినా... గూళ్లు.. అందలో కోళ్లు ఉంటాయి. ఒక్కో ఇంటికి రెండు మూడు గూళ్లు కూడా ఉంటాయి. మనం ఎప్పుడో వదిలేసిన ఈ సంస్కృతిని వీళ్లు ఇంకా కొనసాగిస్తున్నారు. ఇంతకీ వీళ్లు ఈ కోళ్లను ఈ విధంగా పెంచి ఏమి చేస్తారంటే..

adilabad
adilabad

కొండ కోనల్లో నివసించే ఆదివాసీయులకు ప్రకృతే దైవం. చెట్టు, పుట్టకు పూజలు చేస్తుంటారు. నిత్యం ఏదో ఒక పండుగలు జరుపుకుంటారు. వీళ్లు మొక్కే దైవానికి సూదూర ప్రాంతాల్లోనే కాళ్లకు వేసుకున్న చెప్పులను సైతం వదిలేస్తారు. దైవానికి నైవేద్యం సమర్పించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అటువంటిది పులులు తిరుగాడే కవ్వాల్​ అభయారణ్యంలో పరిధిలో... దట్టమైన అటవీ ప్రాంతం.. కనీసం విద్యుత్తు సౌకర్యం లేని గ్రామంలో నివసించే గిరిజనులు తమ దేవతలపై ఎంతటి అనురాగాన్ని చూపుతున్నారో తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తోంది.

ధర్మాజీపేట గ్రామం

ఆ గ్రామంలో ఏ ఇంట్లో చూసినా... గూళ్లు.. అందలో కోళ్లు ఉంటాయి. ఒక్కో ఇంటికి రెండు మూడు గూళ్లు కూడా ఉంటాయి. ఈ కోళ్లను వీరు పెంచి.. తమ దేవతామూర్తులకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందులో విశేషమేమిటంటారా...! నైవేద్యం కోసం అందరిలా ఎక్కడా కోళ్లు కొనుగోలు చేయరు. తమ ఇంట్లోనే.. తమ కళ్ల ముందరే.. తమ చేతులతోనే పెంచిన కోళ్లనే నైవేద్యంగా సమర్పిస్తారు.

adilabad

ఇలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయన్నది ఇక్కడి వాళ్ల నమ్మకం. ఈ సంస్కృతిని మనం ఎక్కడో వదిలేశాం కానీ... ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూరు మండలం బీర్​సాయిపేట పంచాయతీలోని ధర్మాజీపేట గ్రామంలో సుమారు 30 ఇళ్లు ఉంటాయి. 120 మంది జనాబా ఉంటారు. వీళ్లు ఇప్పటికీ ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.

ఆ ఊళ్లో కోడి గూడు లేని ఇళ్లు ఉండదు
కనుసన్నల్లోనే కోళ్లను పెంచుతారు
ప్రతి ఇంట కోళ్ల కోసం గూడు

ఇదీ చూడండి:symphony in stone exhibition: 'తెలంగాణ చరిత్ర, సాహిత్యంపై అవగాహన కల్పించేందుకు కృషి'

ABOUT THE AUTHOR

...view details