- తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేశానని కేసీఆర్ చెబుతుంటారు
- రైతుల ఆత్మహత్యల విషయంలో కేసీఆర్ తెలంగాణను నెంబర్‌వన్ చేశారు
- అవినీతి విషయంలో కేసీఆర్ తెలంగాణను నెంబర్‌వన్ చేశారు
- కేసీఆర్ ఎన్నికల గుర్తు కారు.. కానీ ఆ కారు స్టీరింగ్ మాత్రం ఒవైసీ దగ్గర ఉంటుంది
- ఎంఐఎం దగ్గర స్టీరింగ్ ఉన్న భారాస సర్కారు అవసరమా?
- చంద్రశేఖర్‌రావూజీ.. దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైంది?
- కొందరికి మాత్రమే ఇచ్చి దళితబంధు గురించి గొప్పలు చెబుతున్నారు
- ఆధునిక రజాకార్‌ల నుంచి తెలంగాణను భాజపా మాత్రమే కాపాడుతుంది
- మోదీ సర్కారు ఉచితంగా టీకాలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కరోనా నుంచి కాపాడింది
- జీ-20 నిర్వహించడం వల్ల ప్రపంచ దేశాలు భారత్‌ను ప్రశంసించాయి
Live Updates : డిసెంబర్3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలి : అమిత్ షా - BJP Jana garjana Sabha in Adilabad
amit shah
Published : Oct 10, 2023, 2:45 PM IST
|Updated : Oct 10, 2023, 4:03 PM IST
16:02 October 10
15:54 October 10
- కేసీఆర్ గిరిజనుల కోసం ఎన్నో హామీలు ఇచ్చారు..కానీ అమలు చేయలేదు
- ఆదివాసీలకు కేసీఆర్ రెండు పడకల గదుల ఇళ్లు ఇస్తామన్నారు...ఇచ్చారా?
- అయోధ్యలో రామమందిరం కట్టాలా.. వద్దా.. చెప్పండి?
- అడ్డంకులను అధిగమించి మోదీ సర్కారు రామమందిరం నిర్మిస్తోంది
- మోదీ సర్కారు ఆర్టికల్ 370 ఎత్తివేసి కశ్మీర్‌కు విముక్తి కల్పించింది
- మోదీ సర్కారు సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి శత్రువులను తరిమి కొట్టింది
15:50 October 10
- ప్రతి పేద మహిళకు మోదీ వంటగ్యాస్ సిలిండర్ ఇచ్చారు
- రైతుల ఖాతాల్లో ఏటా రూ.6వేలు జమ చేస్తున్నాం
- దళితులు, గిరిజనుల కోసం మోదీ 9 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు
- కేసీఆర్ మాత్రం పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారు
- ఒడిశాలో పుట్టిన నిరుపేద గిరిజన మహిళను మోదీ రాష్ట్రపతిని చేశారు
- ఎన్నికలు రాగానే కాంగ్రెస్ వాళ్లు కొత్త బట్టలు వేసుకుని వస్తారు
- కాంగ్రెస్ పేదల గురించి మాట్లాడుతుంది కానీ...పేదల కోసం ఏం చేయదు
- గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం చేసిందేమీ లేదు
- 9ఏళ్లుగా మోదీ సర్కారుపై ఎలాంటి అవినీతి ఆరోపణలూ రాలేదు
15:45 October 10
- కేసీఆర్ సర్కారు వైఖరి కారణంగా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైంది : అమిత్ షా
- గిరిజన వర్సిటీకి కేసీఆర్ సర్కారు జాగా చూపించలేదు.. అందుకే ఆలస్యమైంది: అమిత్ షా
- మోదీ ప్రభుత్వం చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది : అమిత్ షా
- మోదీ.. కృష్ణా ట్రైబ్యునల్ నిబంధనలు మార్చి తెలంగాణకు నీటి ఇబ్బంది లేకుండా చేశారు : అమిత్ షా
- పదేళ్లుగా కేసీఆర్ తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదు: అమిత్ షా
- కేసీఆర్.. రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోలేదు: అమిత్ షా
- కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడం గురించే కేసీఆర్ ఆలోచించారు: అమిత్ షా
15:41 October 10
- రజాకార్లపై పోరాడిన వీరభూమికి నమస్కారం చేస్తున్నా
- తెలంగాణలో బీజేపీ రాజ్యం తీసుకురావాలి
- రాష్ట్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వస్తోంది
- డిసెంబర్3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలి
- మోదీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి
- తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన సమయం ఆసన్నమైంది
15:38 October 10
- పవిత్ర భూమి అయినటువంటి ఆదిలాబాద్‌కు వచ్చాను : అమిత్ షా
- కుమురం భీం పేరు చెబితేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి: అమిత్ షా
- కుమురం భీంను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభిస్తా: అమిత్ షా
15:34 October 10
- ప్రధాని మోదీ హ్యాట్రిక్ సాధించబోతున్నారు: కిషన్‌రెడ్డి
- తెలంగాణ విమోచన ఉత్సవాలు మొదటిసారి అమిత్‌షా జరిపించారు
- ఎన్నికల ప్రకటన తర్వాత తొలిసభ ఆదిలాబాద్‌లో జరుపుకుంటున్నాం
15:31 October 10
- కేసీఆర్‌ను ఆయన కుమారుడు ఏం చేస్తున్నారో తెలియట్లేదు
- కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా
- కేసీఆర్ ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు
- తెలంగాణలో ఇక వచ్చేది మోదీ రాజ్యమే
- రాష్ట్రం బాగుపడాలంటే పేదల రాజ్యం రావాలి
- ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి
15:27 October 10
- ధర్మానికి అడ్డా..ఆదిలాబాద్ గడ్డ: బండి సంజయ్
- నిజాం మెడలు వంచి హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు దక్కుతుంది
- అమిత్ షా ఆధునిక సర్దార్ వల్లభాయ్ పటేల్
- రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం
- కేసీఆర్ నా గురువు.. ఆయన వద్ద భాష నేర్చుకున్నా: బండి సంజయ్
- కేసీఆర్ మీకు కనిపిస్తున్నారా.. కేసీఆర్‌కు రక్షణ కల్పించాలి: బండి సంజయ్
15:11 October 10
- ఆదిలాబాద్ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- జనగర్జన సభలో పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- అమిత్ షాకు స్వాగతం పలికిన తరుణ్‌ఛుగ్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్
- ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత రాష్ట్రానికి తొలిసారి వచ్చిన అమిత్ షా
12:24 October 10
ఆదిలాబాద్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు బహిరంగ సభ
- ఆదిలాబాద్‌లో అమిత్‌షా సభ దృష్ట్యా భారీ బందోబస్తు
- ఆదిలాబాద్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు బహిరంగ సభ
- ఆదిలాబాద్: సాధారణ వాహనాలు దారి మళ్లింపు
- ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షణ
Last Updated : Oct 10, 2023, 4:03 PM IST