తెలంగాణ

telangana

ETV Bharat / state

Amit Shah Speech in Adilabad BJP Public Meeting : 'డిసెంబరు 3న హైదరాబాద్​లో కాషాయ జెండా ఎగురుతుంది' - ఆదిలాబాద్​లో నిర్వహించిన జనగర్జన సభలో అమిత్​ షా

Amit Shah Speech in Adilabad BJP Public Meeting : డిసెంబరు 3న హైదరాబాద్​లో కాషాయ జెండా ఎగురుతుందని కేంద్రహోంమంత్రి అమిత్​ షా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఆదిలాబాద్​లో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొని కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Amit Shah
Amit Shah Speech in Adilabad BJP Public Meeting

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 4:22 PM IST

Updated : Oct 10, 2023, 6:56 PM IST

Amit Shah Speech in Adilabad BJP Public Meeting : డిసెంబరు 3న హైదరాబాద్​లో బీజేపీ జెండా(Telangana BJP) ఎగురుతుందని.. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే అధికారం చేపడుతుందని కేంద్రహోంమంత్రి అమిత్ షా(Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్​ ఇంజిన్​ సర్కారు రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఆదిలాబాద్​లోని బీజేపీ జనగర్జన సభ (BJP Public Meeting in Adilabad) పాల్గొన్న అమిత్​ షా.. అనంతరం బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలపై విమర్శలు చేశారు.

"పవిత్ర భూమి అయినటువంటి ఆదిలాబాద్‌కు వచ్చాను. కుమురం భీం పేరు చెబితేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయనను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభిస్తాను. రజాకార్లపై పోరాడిన వీరభూమికి నమస్కారం చేస్తున్నాను. కేసీఆర్​ సర్కారు గిరిజన వర్సిటీకి జాగా చూపించకపోవడం వల్లే.. వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైంది. పదేళ్లుగా కేసీఆర్​ తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదు. ఈ రాష్ట్ర సీఎం.. రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోలేదు. కేసీఆర్​ మాత్రం పదేళ్లుగా తన కుటుంబం కోసమే ఆలోచించారు. కేటీఆర్​ను ముఖ్యమంత్రి చేయడం కోసమే.. నిరంతరం కేసీఆర్​ ఆలోచించేవారని" కేంద్రహోంమంత్రి అమిత్​షా అన్నారు.

Kishan Reddy Fires on CM KCR : 'కమలం వికసిస్తుంటే.. కేసీఆర్ గడబిడ అవుతున్నారు'

Amit Shah Fires on BRS and Congress :ఎన్నికలు రాగానే కాంగ్రెస్​ వాళ్లు కొత్త బట్టలు వేసుకొని వస్తారని కేంద్రహోంమంత్రి అమిత్​ షా ఎద్దేవా చేశారు. ఆ పార్టీ పేదల గురించి మాట్లాడుతుంది కానీ.. పేదల కోసం ఏం చేయదని విమర్శించారు. గతంలో కూడా కాంగ్రెస్​ ప్రభుత్వం పేదల కోసం చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్​ గిరిజనుల కోసం ఎన్నో హామీలు ఇచ్చారని.. కానీ వాటిని ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఆదివాసీలకు సీఎం రెండు పడకల ఇళ్లు ఇస్తామని అన్నారు.. కానీ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణను దేశంలోనే నంబర్​ వన్​ చేశామని కేసీఆర్​ పదేపదే చెబుతుంటాని.. కేవలం రైతుల ఆత్మహత్యల విషయంలోనే తెలంగాణను నంబర్​ వన్​ చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్​ ఎన్నికల గుర్తు కారు.. కానీ ఆ కారు స్టీరింగ్​ మాత్రం ఒవైసీ దగ్గర ఉంటుందని అమిత్​ షా ఎద్దేవా చేశారు. ఎంఐఎం దగ్గర స్టీరింగ్​ ఉన్న బీఆర్​ఎస్​ సర్కారు అవసరమా అంటూ ప్రజలను ప్రశ్నించారు.

"డిసెంబరు 3న హైదరాబాద్​లో బీజేపీ జెండా ఎగరాలి. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో డబుల్​ ఇంజిన్​ సర్కార్​ రావాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్​ సర్కార్​ వైఖరి వల్ల గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైంది. గిరిజన వర్సిటీకి కేసీఆర్​ సర్కారు జాగా చూపించలేదు. " - అమిత్​షా, కేంద్రహోంమంత్రి

BJP Public Meeting in Adilabad :అనంతరం బీజేపీ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ.. మోదీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించందని చెప్పారు. కృష్ణా ట్రైబ్యునల్​ నిబంధనలు మార్చి తెలంగాణకు నీటి ఇబ్బందులు లేకుండా ప్రధాని చేశారని గుర్తు చేశారు. ప్రతి పేద మహిళకు వంట సిలిండర్​ ఇచ్చామని.. రైతుల ఖాతాల్లో ఏటా రూ.6వేలు జమ చేస్తున్నామన్నారు. దళితులు, గిరిజనుల కోసం మోదీ 9 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ బహిరంగ సభలో తరుణ్​ఛుగ్​, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్​, ఈటల రాజేందర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Amit Shah Speech in Adilabad BJP Public Meeting డిసెంబరు 3న హైదరాబాద్​లో కాషాయ జెండా ఎగురుతుంది

BJP MLA Candidates List 2023 : అసెంబ్లీ ఎన్నికల బరిలోకి బీజేపీ సిట్టింగ్​ ఎంపీలు.. 38 మందితో తొలి జాబితా సిద్ధం!

Bandi Sanjay Comments on KCR : దమ్ముంటే.. కేటీఆర్​ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి: బండి సంజయ్​

Last Updated : Oct 10, 2023, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details