ఆదిలాబాద్ పట్టణ శివారులోని 68 సర్వే నంబర్‌ను వక్ఫ్‌బోర్డు స్థలంగా మారుస్తూ.. రెవెన్యూ అధికారులు ధరణిలో నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది. అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ.. స్థిరాస్తి వ్యాపారులతో పాటు ఆ సర్వే నంబర్లో ప్లాట్లను కొనుగోలు చేసిన కొంతమంది జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
వక్ఫ్‌బోర్డు స్థల కేటాయింపుపై వివాదం - adilabad district latest news
ఆదిలాబాద్ పట్టణ శివారులో రెవెన్యూ అధికారులు వక్ఫ్‌బోర్డుకు స్థలం కేటాయించడం వివాదంగా మారింది. అధికారులు తమ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అదే సర్వే నంబర్లో భూమిని కోనుగోలు చేసిన కొందరు డిమాండ్ చేస్తున్నారు. తప్పులను సరిదిద్ది వెంటనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
![వక్ఫ్‌బోర్డు స్థల కేటాయింపుపై వివాదం Dharna in front of the registration office in Adilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11300888-766-11300888-1617705771195.jpg)
ఆదిలాబాద్‌లో రిజిస్ట్రేషన్ కార్యలయం ఎదుట ధర్నా
రెవెన్యూ అధికారుల నిర్ణయంతో తాము తీవ్రంగా నష్టపోతామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులను సవరించి వెంటనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.