భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిధిలో పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 8 పరీక్ష కేంద్రాలలో 1270 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం - ssc exams update
పదో తరగతి పరీక్షలు సురక్షితంగా నిర్వహించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని అన్ని కేంద్రాల్లో ఏర్పాటు పూరైనట్లు అధికారులు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలకు శానిటైజర్ థర్మో స్క్రీనింగ్ మిషన్లు మాస్కులను పంపిణీ చేశామన్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.