వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆదిలాబాద్ పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైల్‌రోకో నిర్వహించారు. రైల్వేస్టేషన్ ఎదుట నిరసన తెలిపిన ఆందోళనకారులు... లోనికి వెళ్లేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
రైల్వేస్టేషన్ ఎదుట ఆందోళనకారుల నిరసన - telangana news today
సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దేశ వ్యాప్తంగా రైల్‌రోకో నిర్వహిస్తున్నారు. ఈ నిరసనకు మద్దతుగా ఆదిలాబాద్ పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైల్‌రోకో చేశారు.
రైల్వేస్టేషన్ ఎదుట ఆందోళనకారుల నిరసన
స్టేషన్ ఎదుట నిలబడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి :డీజీపీ కార్యాలయ ముట్టడికి 'భాజపా' యత్నం.. ఉద్రిక్తం