తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులు నష్టపోకముందే శనగలను కొనుగోలు చేయాలి' - aifu protests in adilabad for groundnut buying

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో అఖిల పక్ష రైతు సంఘం ఆందోళన చేపట్టింది. రైతుల నుంచి ప్రభుత్వం శనగ పంటను కొనుగోలు చేయాలంటూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

aifu protests in adilabad
ఆదిలాబాద్‌లో అఖిలపక్షం ధర్నా

By

Published : Mar 17, 2021, 1:44 PM IST

రైతుల నుంచి ప్రభుత్వం శనగ పంటను కొనుగోలు చేయాలంటూ ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని పంజాబ్ ‌చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి.

విషయం తెలుసుకున్న మార్క్‌ఫెడ్‌ మేనేజరు పుల్లయ్య.. అక్కడికి చేరుకుని త్వరలోనే శనగలు కొనుగోలు చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. వ్యాపారులకు రైతన్నలు తమ పంటను అమ్ముకుని నష్టపోకముందే కొనుగోళ్లు చేపట్టాలని కాంగ్రెస్‌ నాయకురాలు సుజాత పేర్కొన్నారు.

ఇదీ చదవండి:గవర్నర్ ప్రసంగం చూసైనా విమర్శకులు పంథా మార్చుకోవాలి: బాలరాజు

ABOUT THE AUTHOR

...view details