తెలంగాణ

telangana

ETV Bharat / state

జడ్పీ సర్వసభ్య సమావేశానికి అధికారి గైర్హాజరు.. సరెండర్ - ఆదిలాబాద్​ జిల్లా తాజా వార్త

జిల్లా అభివృద్ధిలో జడ్పీ సర్వసభ్య సమావేశం ఎంతో కీలకమైంది. సమగ్ర ప్రణాళికలు రూపొందించేది అక్కడే. అటువంటి సమావేశానికి జిల్లా వ్యవసాయాధికారి గైర్హాజరు కావడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ సీజన్​ ప్రారంభమైనప్పటికీ.. అధికారి హాజరుకాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్ కలుగజేసుకుని.. అధికారిని సరెండర్ చేయాలని ఆదేశించారు.

agriculture officer suspended in adilabad
సర్వసభ్య సమావేశానికి గైర్హాజర్​.. వ్యవసాయ అధికారిని సస్పెండ్​

By

Published : Jun 16, 2020, 1:36 PM IST

Updated : Jun 16, 2020, 4:08 PM IST

ఆదిలాబాద్​ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. వ్యవసాయ శాఖపై చర్చ మొదలు పెట్టారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలకు సమాధానం చెప్పాల్సి ఉండగా ఆమె అందుబాటులో లేదు. ఆమెకు బదులు ఇన్​ఛార్జి అధికారికి సమావేశానికి హాజరయ్యారు.

వ్యవసాయ సీజన్​ ప్రారంభమైన నేపథ్యంలో.. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో.. వ్యవసాయాధికారి రాకపోవడంపై బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రశ్నించారు. ఆమె గతంలోనూ ఇలాగే సెలవులు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

కీలక సమావేశానికి వ్యవసాయాధికారి గైర్హాజరు కావడంపై జడ్పీ వైస్ చైర్మన్ ఆరె రాజన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంటే.. అధికారులు ఇలా నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. జడ్పీ ఛైర్మన్ కల్పించుకుని సదరు వ్యవసాయాధికారిని సరెండర్ చేస్తూ తీర్మానం చేశారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు

Last Updated : Jun 16, 2020, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details