తెలంగాణ

telangana

ETV Bharat / state

టైలరింగ్ దుకాణం దగ్ధం... రెండులక్షల ఆస్తి నష్టం - tailoring shop

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో టైలరింగ్ దుకాణం దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

టైలరింగ్ దుకాణం దగ్ధం

By

Published : May 8, 2019, 10:00 AM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో టైలరింగ్ దుకాణం దగ్ధమైంది. సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని దుకాణ యజమాని బాపూరావ్ వాపోయారు. కొత్త బట్టలు, ఫర్నిచర్, 4 కుట్టుమిషన్లు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చేలోపు దుకాణం పూర్తిగా కాలిపోయిందని బాపూరావ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ అధికారులు పరిశీలించి ఆదుకోవాలని కోరారు.

టైలరింగ్ దుకాణం దగ్ధం

ABOUT THE AUTHOR

...view details