తెలంగాణ

telangana

ETV Bharat / state

అందాల గాయత్రి జలపాతంలో సాహస క్రీడలు - ADVENTURE SPORTS AT GAYATRI WATER FALLS IN ADHILABAD

అడవుల జిల్లా ఆదిలాబాద్​లోని జలపాతాల్లో సాహసక్రీడలు నిర్వహించారు. జాలువారుతున్న జలపాతాల అందాలతో పరవశింపజేసే ఈ ప్రదేశం... ఇప్పుడు సాహస క్రీడలతో సందర్శకులను అలరిస్తోంది. గాయత్రి జలపాతం వద్ద నిర్వహించిన క్రీడలు ఆకట్టుకుంటున్నాయి.

ADVENTURE SPORTS AT GAYATRI WATER FALLS IN ADHILABAD

By

Published : Oct 15, 2019, 11:54 PM IST

Updated : Oct 16, 2019, 4:29 AM IST

ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండలంలోని కడెంనది, గాయత్రిజలపాతంలో జాతీయ సాహస సన్నాహక క్రీడలను నిర్వహించారు. ఇందులో భాగంగా వాటర్ రాపేల్లింగ్ ఫీలింగ్, జుమార్, రాఫ్టింగ్ క్లైంబింగ్, బోటింగ్ తదితర సాహస క్రీడలు నిర్వహించగా... రెండు తెలుగు రాష్ట్రలకు సంబంధించిన 20 మంది సాహస క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ అధ్యక్షుడు రంగారవు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సాహస క్రీడలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.

అందాల గాయత్రి జలపాతంలో సాహస క్రీడలు
Last Updated : Oct 16, 2019, 4:29 AM IST

ABOUT THE AUTHOR

...view details