ఆదివాసీలు తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో ఆందోళనకు దిగారు. పోడుభూములకు పట్టాలివ్వాలని, ఎస్టీ జాబితాలోంచి లంబాడాలను తొలగించాలని, జీవో 3 అమలు వంటి డిమాండ్లను పరిష్కరించాలంటూ కలెక్టరేట్‌ను ముట్టడించే యత్నం చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.
డిమాండ్ల సాధనకై కలెక్టరేట్ ముట్టడికి ఆదివాసీల యత్నం - ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ఆదివాసీల ఆందోళన
తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడికి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు యత్నించారు. పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. పోడుభూములకు పట్టాలివ్వాలని, ఎస్టీ జాబితాలో లంబాడాలను తొలగించాలని, జీవో 3 అమలు చేయాలని అక్కడే బైఠాయించారు. ధర్నా శిబిరానికి అదనపు పాలనాధికారి సంధ్యారాణి వచ్చి వినతిపత్రం స్వీకరించారు.
adivasis
ధర్నా శిబిరానికి అదనపు పాలనాధికారి సంధ్యారాణి వచ్చిన వినతిపత్రం స్వీకరించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాటికి తమ సమస్యలు పరిష్కరించాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?