తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగోబా జాతర: గంగాజలం కోసం కొండలు ఎక్కుతూ..

ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన కేస్లాపూర్‌ నాగోబా జాతరకు సమయం సమీపిస్తోంది. అందుకు కీలకమైన గంగాజలం కోసం మెస్రం వంశీయులు బయలు దేరారు. ఉట్నూర్ మండలం తారలో వారికి ఘనస్వాగతం లభించింది.

adivasilu
పవిత్ర గంగాజలం కోసం అడవిలో ఆదివాసీల ప్రయాణం

By

Published : Jan 12, 2020, 11:57 AM IST

పవిత్ర గంగాజలం కోసం అడవిలో ఆదివాసీల ప్రయాణం

ఆదివాసీ గిరిజనుల అతిపెద్ద వేడుకకు సర్వం సిద్ధమైంది. వారి ఆరాధ్యదైవం నాగోబాను గంగా జలాలతో అభిషేకించడం ఆనవాయితీ. ఏటా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరి నదిలో గల హస్తినమడుగు నుంచి జలాలను ప్రత్యేక కలశంలో సేకరించి తీసుకొస్తారు మెస్రం వంశీయులు. దీనికోసం ఈనెల ఏడో తేదీన కాలినడకన బయలుదేరారు.

తారలో ఘన స్వాగతం...

ఉట్నూర్ మండలం తారకు చేరుకున్న మస్రం వంశీయులకు ఎంపీపీ జయవంత్ రావు, ఆదివాసీ నేత బాజీరావు నేతృత్వంలో స్థానికులు ఘన స్వాగతం పలికారు. తాండాలో పూజలు నిర్వహించుకొని ఏలూరు మీదుగా తేజాపూర్ బయలు దేరారు. కొండలు ఎక్కుతూ.. గుట్టలు ఎక్కుతూ... వారి యాత్ర సాగుతోంది. ఈ నెల 14న వారు హస్తిన వాగుకు చేరుకుంటారు. అక్కడి పవిత్ర గంగాజలంతో తిరుగు ప్రయాణమవుతారు.

ఇవీ చూడండి: నేటితో 'పల్లె ప్రగతి 2.o' ముగింపు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details