తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదివాసీల పెళ్లి అదుర్స్.. ఎడ్ల బండ్లే కట్న కానుకలు

'కట్నం అడిగేవాడు గాడిద' అని పదే పదే చెప్పేవారు కూడా.. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ప్లేట్​ మార్చేస్తారు. లక్షల రూపాయలు కట్నంగా తీసుకోవడానికి సిద్ధపడ్తారు. కట్నం ఒక్కటేనా..? బైకు.. కారు.. బంగారం.. ఫర్నిచర్​.. ఇలా ప్రస్తుతం ఓ పెళ్లి జరగాలంటే, ఆడపిల్ల తండ్రి చేయాల్సిన ఖర్చు అంతా ఇంతా కాదు. అడిగిందంతా ఇస్తేనే.. తాళి కడతానని బెదిరించే అల్లుళ్లున్న కాలంలో.. ఎడ్ల బండిస్తే చాలనేవారూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల పెళ్లిల్లో.. జరిగే ఈ తంతు చూస్తే వారెవా అనిపించకమానదు.

By

Published : Mar 24, 2021, 11:52 AM IST

Updated : Mar 24, 2021, 2:46 PM IST

adivasi people gives oxe cartas as dowry at the wedding
అక్కడ ఎడ్ల బండ్లే.. కట్న కానుకలు..!

కూతురి సంతోషం కోసం నానా తంటాలు పడైనా సరే.. అల్లుడు కోరుకున్న వాహనాన్ని కట్నంగా ఇస్తారు ఆడపిల్ల తల్లిదండ్రులు. కానీ ఆదివాసీలు మాత్రం.. అందుకు భిన్నంగా ఎడ్ల బండ్లను ఇస్తున్నారు. జీవనోపాధికి ఉపయోగపడుతుందనే కారణంతో.. ఆ నూతన వరుడూ దాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాడు. వివాహం అనంతరం.. జరిగే ఈ అరుదైన వేడుకను చూడాలంటే ఆదిలాబాద్​కు వెళ్లి తీరాలి.

ఎడ్ల బండ్లే.. కట్న కానుకలు..!

ఆదివాసీలు.. పెళ్లిల్లో కట్నాలు ఇవ్వరు. వారి సంప్రదాయం ప్రకారం.. ముందుగా ఆడపిల్లకు వివాహం జరిపించి అత్తవారింటికి పంపుతారు. ఆ తర్వాత వచ్చే మొదటి దీపావళి పండుగకు నూతన వధూవరులను పిలుస్తారు. వారికి తోచిన వస్తువులను ఇచ్చి పంపుతారు. కొన్నేళ్లుగా ఇదే జరుగుతున్నా.. ప్రస్తుతం వీరు మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు.

అప్పగింతలు జరిగే సమాయానికి కాస్త ముందుగా.. ఎండ్ల బండిని అల్లుడికి కానుకగా ఇస్తున్నారు. నూతన వధూవరులతో వాటికి పూజలు జరిపిస్తారు. గుడిహత్నూర్, జైనూర్ మండలాల పరిధుల్లో ఈ వేడుకలు వైభవంగా జరుగుతాయి.

ఇదీ చదవండి:'దొంగతనం చేస్తారు... ఇంటి యజమానినే మీరెవరని ప్రశ్నిస్తారు'

Last Updated : Mar 24, 2021, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details