ఆదిలాబాద్ జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు సాదాసీదాగా జరిగాయి. జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాఠోడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలకు ఆసిఫాబాద్ శాసనసభ్యుడు ఆత్రం సక్కు, అదనపు పాలనాధికారి డేవిడ్ సహా జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
'రైతు వేదికల నిర్మాణం వేగవంతం చేయాలి' - adilabad zp standing committee meeting
తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధికారులను ఆదేశించారు.
సాదాసీదాగా ఆదిలాబాద్ జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు, రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు.. అధికారులను ఆదేశించారు. రైతులకు సకాలంలో సహకార రుణాలు అందేలా చూడాలని, మండల స్థాయిలో మినీస్టేడియాలను ఏర్పాటు చేయాలని జడ్పీటీసీ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు.