తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కష్టకాలంలో ఆదుకోవడం హర్షణీయం: జడ్పీ చైర్మన్​ - ఆదిలాబాద్​ జిల్లా తాజా వార్తలు

కరోనా కష్టకాలంలో స్వచ్ఛంద సంస్థలు పేదలను ఆదుకోవడం హర్షణీయమని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ అన్నారు. రాష్ట్రప్రభుత్వం నిరుపేదలకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు.

Adilabad Zilla Parishad Chairman Janardhan distribute dailyneeds
కరోనా కష్టకాలంలో ఆదుకోవడం హర్షణీయం: జడ్పీ చైర్మన్​

By

Published : Jan 8, 2021, 10:30 PM IST

కరోనా కష్టకాలంలో స్వచ్ఛంద సంస్థలు పేదలను ఆదుకోవడం హర్షణీయమని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ పేర్కొన్నారు. ఉట్నూరు మండల కేంద్రంలోని చర్చిలో లేత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 60 నిరుపేద కుటుంబాలకు... బియ్యంతో పాటు ఎనిమిది రకాల వస్తువులతో కూడిన కిట్టును అందించారు.

తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. పేదలకు సహాయం చేయడం సంతోషదాయకమైన విషయమని పేర్కొన్నారు. కరోనా కాలంలో కులమత బేధాలు లేకుండా స్వచ్ఛంద సంస్థలు పేద కుటుంబాలను ఆదుకున్నాయని తెలిపారు. చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను జడ్పీ చైర్మన్ ఘనంగా సన్మానించారు.

ఇదీ చదవండి:డబుల్​ బెడ్​రూం ఇళ్ల పట్టాలు అందజేసిన మంత్రి హరీశ్​

ABOUT THE AUTHOR

...view details