ఆదిలాబాద్ జిల్లాలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో ఎస్పీ రాజేశ్ చంద్ర బుల్లెట్‌పై పర్యటించారు. ప్రత్యేక పోలీసులతో కలిసి అటవీప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు.
మావోయిస్టు తల్లితో ముచ్చట ప్రధానంగా మారుమూల అటవీ ప్రాంతమైన బజార్‌హత్నూర్ మండలం డెడ్రాకు వెళ్లారు. అజ్ఞాతంలో ఉన్న సుమన అలియాస్ సంగీతక్క మాతృమూర్తిని కలిశారు. వారికి ఏడాదిపాటు సరిపోయే నిత్యావసర సరకులను అందజేశారు.
అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలకు టీవీని బహుకరించారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు సాధించేదీ ఏమి లేదనీ, ఇప్పటికే కరోనా మహామ్మారితో కీలక నేతలు మరణిస్తున్నారని ఎస్పీ అన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. ప్రభుత్వం తరఫున అందాల్సిన సంక్షేమ ఫలాలతో పాటు ఆధునిక వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు.
బుల్లెట్‌పై ఎస్పీ రాజేశ్ చంద్ర ఇదీ చదవండి:CM KCR: కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లేఅవుట్లు అనుమతించవద్దు: సీఎం