ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆదిలాబాద్ బస్‌డిపో ఎదుట తెలంగాణ మజ్దూర్ యూనియన్ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా డిపో ఎదుట ప్రభుత్వం, యాజమాన్య తీరుకు నిరసనగా కార్మికులు నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తమను విస్మరించడమేంటనీ టీఎంయూ నాయకుడు రమేష్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆర్టీసీని విలీనం చేసే చర్యలు చేపట్టకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
ఆర్టీసీని విలీనం చేయాలి: టీఎంయూ - TMU
ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆదిలాబాద్ బస్‌డిపో ఎదుట తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆందోళన చేపట్టింది. విలీనం చేయకపోతే సమ్మెకు దిగుతామని కార్మికులు హెచ్చరించారు.
ఆర్టీసీని విలీనం చేయాలి: టీఎంయూ