తెలంగాణ

telangana

ETV Bharat / state

'కుటుంబానికి దూరంగా ఉంటూ... నానా అవస్థలు పడుతున్నాం' - ఆదిలాబాద్​ జిల్లా తాజా వార్తలు

ఏళ్లుగా ఆదిలాబాద్​ రిమ్స్‌లో పనిచేస్తున్న తమను బదిలీ చేయాలంటూ స్టాఫ్‌నర్సులు ఆందోళన బాట పట్టారు. కుటుంబానికి దూరంగా ఉంటూ... నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

staff nurses protest for transfer
బదిలీ చేయాలంటూ రిమ్స్​ స్టాఫ్​నర్సుల ఆందోళన

By

Published : Jun 15, 2021, 3:38 PM IST

కుటుంబాలకు దూరంగా ఎన్నో ఎళ్లుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నామని... రిమ్స్​లో పనిచేస్తున్న స్టాఫ్ ​నర్సులు ఆందోళన బాటపట్టారు. ఇకనైనా ప్రభుత్వం తమ స్వస్థలాలకు సమీపంలోని ఆస్పత్రులకు బదిలీ చేయాలని... గంటసేపు విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు.

వృద్ధాప్యంలో అనారోగ్యం బారినపడిన తమ కుటుంబ పెద్దలకు అందుబాటులో ఉండలేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బదిలీ నిషేధాన్ని ఎత్తివేసి తమకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే విధులు బహిష్కరించి నిరవధిక ఆందోళనకు సిద్ధమవుతామన్నారు.

ఇదీ చదవండి: 2021 చివర్లో అమెరికాకు మోదీ!

ABOUT THE AUTHOR

...view details