ఆదిలాబాద్ రిమ్స్ జూనియర్ డాక్టర్లు నిరసన బాట పట్టారు. ఉపకారవేతనాలు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. విధులు బహిష్కరించి ఓపి విభాగం ముందు ఆందోళన చేపట్టారు. నాలుగు నెలల నుంచి ఉపకార వేతనాలు చెల్లించపోవడం వల్ల తాము ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
రిమ్స్ ఆస్పత్రి ఎదుట జూనియర్ డాక్టర్ల ధర్నా - వైద్యుల నిరసన
నాలుగు నెలలుగా ఉపకార వేతనాలు చెల్లించకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆదిలాబాద్ రిమ్స్ జూనియర్ డాక్టర్లు ఆందోళన నిర్వహించారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఎదుట జూనియర్ డాక్టర్ల ధర్నా