తెలంగాణ

telangana

ETV Bharat / state

నాలుగో రోజుకు చేరిన రిమ్స్ ఒప్పంద నర్సుల సమ్మె - రిమ్స్​ ఆస్పత్రి నర్సుల సమ్మె వార్తలు ఆదిలాబాద్​

అధికారుల వైఖరి పట్ల మోకాళ్ల మీద నిలబడి ఆదిలాబాద్​ రిమ్స్ ఆస్పత్రి ఒప్పంద నర్సులు వినూత్న నిరసన తెలిపారు. పెండింగ్​ వేతనాలు చెల్లించాలని చేస్తోన్న వారి సమ్మె సోమవారానికి నాలుగో రోజుకు చేరింది. ఏడు నెలలుగా వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా.. రిమ్స్ డైరెక్టర్, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని స్టాఫ్​ నర్సులు పేర్కొన్నారు.

నాలుగో రోజుకు చేరిన రిమ్స్ ఒప్పంద నర్సుల సమ్మె
నాలుగో రోజుకు చేరిన రిమ్స్ ఒప్పంద నర్సుల సమ్మె

By

Published : Oct 5, 2020, 4:33 PM IST

పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆదిలాబాద్ రిమ్స్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. సోమవారం అధికారుల వైఖరి పట్ల మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు. కరోనా లాంటి ఈ సమయంలో రోగులకు సేవలు అందించాల్సిన తాము రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపాల్సిన దుస్థితి నెలకొందని స్టాఫ్ నర్సులు వాపోయారు.

ఏడు నెలలుగా వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా.. రిమ్స్ డైరెక్టర్, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. ఈ నిరసనలో స్టాఫ్ నర్సులు బి.పెర్సి, జి.కవిత కరుణ, బి.వసంత రాణి, జె.జయ, కమలాబాయి, వాగ్మరే సారిక, డి.పద్మావతి, ఆడే స్వప్న ఏఐటీయూసీ నాయకుడు దేవేందర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:వైద్యులు లేని ఆస్పత్రులు.. రోగులకు తప్పని ఇబ్బందులు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details