తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిపోలేరు.. పండుగ కోసం ఇళ్లకు వెళ్లొచ్చారంతే.. - ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి నుంచి కొవిడ్ బాధితులు పారిపోలేదు

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి నుంచి కొవిడ్ బాధితులెవరూ పారిపోలేదని... కొంతమంది మాత్రం బక్రీద్ పండుగ కోసం తమ ఇళ్లకు వెళ్లి వచ్చారని ఆస్పత్రి డైరెక్టర్ బానోత్ బలరాం తెలిపారు.

adilabad rims hospital director balaram nayak
పారిపోలేరు.. పండుగ కోసం ఇళ్లకు వెళ్లొచ్చారంతే..

By

Published : Aug 2, 2020, 4:47 PM IST

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రి నుంచి కొవిడ్ బాధితుల పరారీ ఘటనపై ఆసుపత్రి డైరెక్టర్‌ బానోత్‌ బలరాం స్పందించారు. తొలుత ఎవరూ పారిపోలేదని చెప్పిన ఆయన... ఆ తర్వాత కొంతమంది బక్రీద్‌ పండుగ కోసం తమ ఇళ్లకు వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. మరికొందరు హోం ఐసోలేషన్‌లో ఉంటామని అడుగుతున్నారంటూ తెలిపారు.

ప్రస్తుతం రిమ్స్‌ కొవిడ్‌ వార్డులో అసౌకర్యాలను తెలుసుకునేందుకు కమిటీ వేశామశామని డైరెక్టర్ బానోత్ బలరాం వెల్లడించారు. బాధితులు తమకు తెలియకుండా ఎక్కడికీ పారిపోలేరని... ప్రజలెవరూ భయపడాల్సి అవసరం లేదని అన్నారు.

ఇవీ చూడండి:గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details