ఆదిలాబాద్ జిల్లాలో లాక్డౌన్ను పోలీసులు మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే అకారణంగా బయటకు వస్తున్న వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వాహన తనిఖీల్లో పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బయటకు వచ్చిన వారిని వాహనాల్లో ఎక్కించుకొని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
Lockdown implementation: అనవసరంగా బయటకొస్తే.. ఐసోలేషన్ కేంద్రానికి తరలింపు - lockdown new rules in adilabad
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా నిబంధనలకు విరుద్ధంగా బయటకు వస్తున్న వారిని పోలీసులు ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని సూచిస్తున్నారు.
అనవసరంగా బయటకొస్తే.. ఐసోలేషన్ కేంద్రానికి తరలింపు
అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని.. ఒక వేళ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అనవసరంగా ఎవరు బయటకు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
ఇదీ చదవండి :Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు