తెలంగాణ

telangana

ETV Bharat / state

తొలి కరోనా కేసుతో అధికారులు అప్రమత్తం - coronavirus news

ఆదిలాబాద్ జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మర్కజ్ యాత్రకు వెళ్లిన వారితో పాటు.. కుటుంబసభ్యులను గుర్తించి హోం క్వారంటైన్​లో ఉంచారు. దిల్లీకి వెళ్లిన వారి నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్​ పంపించారు.

coronavirus
coronavirus

By

Published : Apr 4, 2020, 1:49 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా నుంచి దిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 70 మంది యాత్రికులతో పాటు 421 మంది వారి కుటుంబీకులను వైద్యారోగ్యశాఖ గుర్తించింది. వారందరినీ అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు.

దిల్లీకి వెళ్లి వచ్చినవాళ్ల రక్తనమూనాలను హైదరాబాద్‌కు పంపించారు. ఇందులో ఒకరికి పాజిటివ్ రావడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. మరింత సమాచారాన్ని ఈటీవీ భారత్​ ప్రతినిధి మణికేశ్వర్‌ అందిస్తారు.

తొలి కరోనా కేసుతో అధికారులు అప్రమత్తం

ఇదీ చూడండి:ఆదిలాబాద్​ జిల్లాలో తొలి కరోనా కేసు

ABOUT THE AUTHOR

...view details