ఆదిలాబాద్ జిల్లా నూతన పాలనాధికారిగా సిక్తాపట్నాయక్ బాధ్యతలు స్వీకరించారు. శ్రీదేవసేన విద్యాశాఖ సంచాలకులుగా బదిలీ కాగా... ఆమె స్థానంలో పెద్దపల్లి పాలనాధికారిగా పనిచేస్తున్న సిక్తా పట్నాయక్‌ను ప్రభుత్వం నియమించింది.
పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన సిక్తా పట్నాయక్ - adilabad news
ఆదిలాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా సిక్తా పట్నాయక్ బాధ్యతలు చేపట్టారు. పెద్దపల్లి పాలనాధికారిగా విధులు నిర్వహించిన సిక్తా పట్నాయక్‌ను ప్రస్తుతం ఆదిలాబాద్ కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఇంతకు మందు కలెక్టర్గా పనిచేసిన శ్రీదేవసేన విద్యాశాఖకు బదిలీ కాగా... ఈ మార్పు చోటుచేసుకుంది.

adilabad new collector siktha patnayak took charges from sridevasena
కలెక్టర్ ఛాంబర్‌లో శ్రీదేవసేన నుంచి బాధ్యతలు తీసుకున్న సిక్తా పట్నాయక్.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని అధికారులకు సూచించారు. జిల్లా అధికారులు నూతన కలెక్టర్కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.