తెలంగాణ

telangana

ETV Bharat / state

కౌన్సిలర్లతో మున్సిపల్​ ఛైర్మన్ టెలి కాన్ఫరెన్స్ - ఆదిలాబాద్ మున్సిపాలిటీ

కొవిడ్ దృష్ట్యా.. వార్డు కౌన్సిలర్ల సమావేశాన్ని టెలి కాన్ఫరెన్స్ ద్వారా జరిపామని ఆదిలాబాద్ మున్సిపల్​ ఛైర్మన్​ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలంటూ కౌన్సిలర్లకు పలు సూచనలు చేసినట్లు ఆయన వివరించారు.

tele conference
tele conference

By

Published : Apr 29, 2021, 5:11 PM IST

ఆదిలాబాద్​ మున్సిపల్​ ఛైర్మన్​ జోగు ప్రేమేందర్.. వార్డు కౌన్సిలర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వార్డుల వారీగా ఒక్కొ కౌన్సిలర్​ను.. వారి ప్రాంతల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశ మందిరం చిన్నగా ఉండటం, సభ్యుల్లో ఇద్దరు కరోనా బారిన పడటంతో.. కార్యక్రమాన్ని టెలి కాన్ఫరెన్స్ ద్వారా జరిపినట్లు ఆయన వివరించారు.

కొవిడ్ రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలంటూ కౌన్సిలర్లకు పలు సూచనలు చేసినట్లు ప్రేమేందర్ వివరించారు. ప్రజలందరూ మాస్క్​ ధరించడంతో పాటు ప్రభుత్వ​ నిబంధనలను తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్​ జహీర్ రంజాని, మున్సిపల్​ కమిషనర్ శైలజ, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:హైకోర్టు వ్యాఖ్యలు సర్కార్‌కు చెంపపెట్టు: కోమటిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details