ఆదివాసీలు సాగుచేస్తున్న భూములను అడ్డుకుంటే అటవీశాఖ అధికారులపై తిరగబడాల్సిందేనని ఎంపీ సోయం బాపూరావు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్, చింతకర్ర గ్రామాల్లో ఆయన పర్యటించారు. నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన కుమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు.
అడ్డుకుంటే అధికారులపై తిరగబడండి: సోయం - Soyam bapurao sensational comments on Forest officers
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్, చింతకర్ర గ్రామాల్లో ఎంపీ సోయం బాపూరావు పర్యటించారు. నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన కుమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు.
అడ్డుకుంటే అధికారులపై తిరగబడండి: సోయం బాపూరావు
యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఆదివాసీలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇదీ చదవండి :రోజూ 10లక్షల మందికి టీకా ఇచ్చేందుకు సిద్ధం : ఈటల