రిమ్స్ వైద్యులపై చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాపురావు - రిమ్స్ ఎదుట ఎంపీ సోయం బాపురావు ధర్నా
అక్రమాలకు పాల్పడుతున్న ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ సోయం బాపురావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నాడు ఆసుపత్రి ముందు ధర్నా చేశారు.
రిమ్స్ వైద్యులపై చర్యలకు తీసుకోవాలి: ఎంపీ బాపురావు
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భాజపా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. చికిత్సలను నిర్లక్ష్యం చేస్తూ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. వైద్యుల అక్రమాలపై విజిలెన్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, పార్టీ శ్రేణులు రిమ్స్ వైద్యుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.